అహోబిలంలో మహా సంప్రోక్షణ
ABN , First Publish Date - 2022-04-22T05:40:34+05:30 IST
ఎగువ అహోబిలం నరసింహ స్వామి సన్నిధిలో బాలాలయ ప్రతిష్ఠ, కళాకర్షణ, హోమం కార్యక్రమాలను వేదపండితులు గురువారం నిర్వహించారు.
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 21: ఎగువ అహోబిలం నరసింహ స్వామి సన్నిధిలో బాలాలయ ప్రతిష్ఠ, కళాకర్షణ, హోమం కార్యక్రమాలను వేదపండితులు గురువారం నిర్వహించారు. ఎగువ అహోబిలంలో ఈ నెల 30వ తేది నుంచి మే 4వ తేది వరకు చేపట్టనున్న జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంప్రోక్షణలో భాగంగా పై కార్యక్రమాలను చేపట్టినట్లు వేద పండితులు తెలిపారు. దీంతో ఎగువ అహోబిలం గుహలో వేంచేసియున్న అహోబిలం నరసింహస్వామి వారి మూలమూర్తి దర్శనం భక్తులకు ఉండదన్నారు. భక్తులు సహకరించాలన్నారు.