శ్రీశైల జలాశయానికి స్వల్పంగా ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-11-19T00:52:20+05:30 IST

శ్రీశైల జలాశయానికి శుక్రవారం ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది.

 శ్రీశైల జలాశయానికి స్వల్పంగా ఇన్‌ఫ్లో

శ్రీశైలం, నవంబరు 18: శ్రీశైల జలాశయానికి శుక్రవారం ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల సమయానికి సుంకేసుల నుంచి 10,037 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.10 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 163.9724 టీఎంసీలుగా నమోదయింది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఏపీ విద్యుత్‌ కేంద్రం ద్వారా 27,006, తెలంగాణ విద్యుత్‌ కేంద్రం ద్వారా 26,840 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Updated Date - 2022-11-19T00:52:20+05:30 IST

Read more