స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితా వెల్లడి

ABN , First Publish Date - 2022-10-08T04:33:23+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత యాజమాన్యాల్లోని పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లుగా పని చేస్తున్న అర్హతగల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందడానికి సంబంధించిన సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఈవో రంగారెడ్డి శుక్రవారం తెలిపారు.

స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితా వెల్లడి

కర్నూలు(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 7: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత యాజమాన్యాల్లోని పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లుగా పని చేస్తున్న అర్హతగల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందడానికి సంబంధించిన సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఈవో రంగారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ జాబితాలో పేరు ఉన్న ఉపాధ్యాయులు అర్హత ధృవీకరణ పత్రాలు ఈ నెల 8వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు తమ సేవా పుస్తకం, అర్హత ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఒక సెట్‌, జిరాక్స్‌ కాఫీలను తీసుకుని వెరిఫికేషనకు హాజరు కావాలని సూచించారు.



Updated Date - 2022-10-08T04:33:23+05:30 IST