సచివాలయాల సేవలు పెరగాలి

ABN , First Publish Date - 2022-08-09T06:16:14+05:30 IST

గ్రామ వార్డు సచివాలయాల నుంచి ప్రజలకు సేవలు పెరగాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

సచివాలయాల సేవలు పెరగాలి
కలెక్టర్‌కు సమస్యలు విన్నవిస్తున్న ప్రజలు

కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు(కలెక్టరేట్‌) ఆగస్టు 8: గ్రామ వార్డు సచివాలయాల నుంచి ప్రజలకు సేవలు పెరగాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.  జిల్లాలో తొమ్మిది సచివాలయాల్లో ఒక్క సేవ కూడా అందకపోవడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 14 మండలాకు సంబంధించి 24 సచివాలయాల్లో ఒక్క సర్వీస్‌ మాత్రమే అందించారని తెలిపారు. ప్రజలకు సేవలందించే విషయమై సచివాలయ ఉద్యోగులకు సెప్టెంబరు నుంచి వర్క్‌షాపులు ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. మండల స్పెషల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీ డీవోలతో కూడా ఈ అంశంపై సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే స్పందన అర్జీలు రీఓపెన్‌ కాకూడదని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T06:16:14+05:30 IST