ఎస్సీ, ఎస్టీ కేసులను పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-12-31T00:31:47+05:30 IST

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద నమోదైన కేసు లను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయా లని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికా రులను ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ కేసులను పరిష్కరించాలి: కలెక్టర్‌

నంద్యాల టౌన్‌, డిసెంబరు 30: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద నమోదైన కేసు లను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయా లని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికా రులను ఆదేశించారు. శుక్రవారం కలెక్ట రేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్పీ రఘువీర్‌రెడ్డితో కలిసి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఈనెల 22వ తేదీ వరకు జిల్లాలో 110 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయని, ఇందులో 31 కేసులు అసత్య ఆరోపణలుగా తేలాయని అన్నారు. ఉమ్మడి జిల్లాలో పునర్విభజనకు ముందు 1063కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నా యని, నంద్యాలకు సంబంధించిన కేసులను విభ జించి పరిష్కరించేం దుకు చర్యలు తీసుకోవా లని సాంఘిక సంక్షేమ శాఖ డీడీని ఆదేశించారు. జిల్లా సమాచారశాఖ అధికారి జయ రావు, పౌర సరఫరాలశాఖ డీఎం రాజునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:31:48+05:30 IST