మొక్కలతో శుభాకాంక్షలు చెప్పండి

ABN , First Publish Date - 2022-12-30T23:51:24+05:30 IST

నూతన సంవత్సరం సందర్భంగా మొక్కలు ఇచ్చి శుభాకాక్షలు చెప్పడం మంచి సంప్రదాయమని కలెక్టర్‌ పి. కోటేశ్వరరావు అన్నారు.

   మొక్కలతో శుభాకాంక్షలు చెప్పండి

- కలెక్టర్‌ పి. కోటేశ్వరరావు

కర్నూలు (కల్చరల్‌), డిసెంబరు 30: నూతన సంవత్సరం సందర్భంగా మొక్కలు ఇచ్చి శుభాకాక్షలు చెప్పడం మంచి సంప్రదాయమని కలెక్టర్‌ పి. కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాత్రి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బర్మా సురేష్‌కుమార్‌, గ్రీట్‌ విత గ్రీన సొసైటీ అధ్యక్షుడు శ్రీరాములు కలెక్టర్‌ను కలిసి పూల మొక్కలను అందజేశారు. జేవీవీ రాష్ట్ర వ్యాప్తంగా ‘నూతన సంవత్సరానికి బొకేలు వద్దు, మొక్కలు ముద్దు’ అనే నినాదంతో గ్రీట్‌ విత గ్రీన కార్యక్రమాన్ని ప్రచారం నిర్వహిస్తోందని వారు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జేవీవీ చేపట్టిన ఈ కార్యక్రమం మంచి పరిణామమని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసేవారికి మొక్కలతో శుభాకాంక్షలు చెబుతానని అన్నారు.

Updated Date - 2022-12-30T23:51:25+05:30 IST

Read more