శ్రీగిరికి సంక్రాంతి శోభ

ABN , First Publish Date - 2022-01-13T06:00:02+05:30 IST

శ్రీశైలంలో బుధవారం సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.

శ్రీగిరికి సంక్రాంతి శోభ
విద్యుతదీపాలంకరణతో ముస్తాబు అయిన ఆలయం

ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు


శ్రీశైలం, జనవరి 12: శ్రీశైలంలో బుధవారం సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని మహాగణపతి పూజ చేశారు. కంకణాలకు పూజలు నిర్వహించి వాటిని అర్చకులు, అధికారులు ధరించారు. సాయంకాలం అంకురార్పణ జరిపిందిచ ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం మీద పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్సవాల సందర్భంగా 12 నుంచి 18వ తేదీ వరకు ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభిషేకం, కుంకుమార్చన యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఉత్సవాల్లో రెండో రోజు 13 నుంచి స్వామివారికి వాహన సేవలు మొదలువతాయి. 15న సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం ఉంటుంది. 14న 5 సంవత్సరాల చిన్నారులకు సామూహిక భోగిపండ్ల కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు 13వ తేదీ సాయంకాలం 5 లోపు ప్రచురణ విభాగంలో పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. 15వ తేదీ సంక్రాంతి రోజున మహిళలకు ముగ్గుల పోటీలు ఉంటాయని, ముందురోజు సాయంత్రం పేర్లు నమోదు చేయించుకోవాలని అన్నారు. 





Updated Date - 2022-01-13T06:00:02+05:30 IST