పత్తి రైతుకు గులాబి గుబులు

ABN , First Publish Date - 2022-09-25T05:30:00+05:30 IST

ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి పంటకు గులాబి రంగు పురుగు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పత్తి రైతుకు గులాబి గుబులు
తెగుళ్లు సోకిన పత్తి పంటను చూపుతున్న రైతు

ఓర్వకల్లు, సెప్టెంబరు 25: ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి పంటకు గులాబి రంగు పురుగు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ మందు పిచికారి చేసినా ఫలితం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కన్నమడకల, హుశేనాపురం, పూడిచెర్ల, ఓర్వకల్లు, గుట్టపాడు, నన్నూరు, లొద్దిపల్లె తదితర గ్రామాల్లో 3,500 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు. పూత, కాయ దశకు చేరుకోగా గులాబి రంగు పురుగు సోకింది. దీంతో పూత, కాయ రాలిపోతోంది. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల దా కా పెట్టుబడులు పెట్టామని, ఆ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి నాటిన 30 నుంచి 60 రోజుల్లో గులాబి పురుగు రాకుండా పొలంలో లింగాకర్షక బుట్టలు ఎకరాకు 5 నుంచి 10 పెట్టాలని వ్యవసాయాధికారి సుధాకర్‌ చెబుతున్నారు. పొలం చుట్టూ రెండు సార్లు నాన్‌బీటీ పత్తి విత్తనాలు నాటాలని, వేపనూనె, ఆక్సిఫైడ్‌ దోమ నివా రణకు వాడాలని అన్నారు.

రైతులను ఆదుకోవాలి

ఎన్నడూలేని విధంగా పత్తి పంటకు వైరస్‌తోపాటు గులాబి రంగు పురుగు అధికమైంది. వాటి ఉధృతిని తగ్గించేందుకు రైతులు పంటపై పిచికారి చేసినా ప్రయో జనం లేదు. పత్తి పంట దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రైతులు అప్పుల వలయంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
- శ్రీనివాసులు, రైతు

Read more