రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2022-03-05T05:42:29+05:30 IST

మండలంలోని 80 బన్నూరు- జూపాడుబంగ్లా గ్రామాల మధ్యలోని మలుపు కేజీ రోడ్డుపై మోటారుసైకిల్‌ను బొలేరో వాహనం ఢీకొన్న ఘటనలో సుబ్బన్న(32) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

జూపాడుబంగ్లా, మార్చి 4: మండలంలోని 80 బన్నూరు- జూపాడుబంగ్లా గ్రామాల మధ్యలోని మలుపు కేజీ రోడ్డుపై మోటారుసైకిల్‌ను బొలేరో వాహనం ఢీకొన్న ఘటనలో సుబ్బన్న(32) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆత్మకూరు మండలం నల్లకాల్వకు చెందిన సుబ్బన్న అనే వ్యక్తి నల్లకాల్వ నుంచి భార్య ఊరికి పీరుసాహెబ్‌పేట గ్రామానికి మోటారు సైకిల్‌పై వెళుతూ మలుపువద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బొలూరో వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. Read more