‘నర్సరీలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి’

ABN , First Publish Date - 2022-12-10T00:17:58+05:30 IST

నర్సరీలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఉద్యానవన అధికారిణి దివ్య తెలిపారు.

‘నర్సరీలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి’

పాణ్యం, డిసెంబరు 9: నర్సరీలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఉద్యానవన అధికారిణి దివ్య తెలిపారు. పాణ్యంలోని ఎంఈవో కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ మండలంలో 26 నర్సరీలు ఉండగా ఇప్పటి వరకు 15 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఏపీ నర్సరీ యాక్ట్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌ ద్వారా మొక్కల కొనుగోలు, అమ్మకం, రైతుల వివరాలు తదితర వివరాలు ఉద్యానవన శాఖకు తెలియజేయాల్సి ఉందన్నారు. బయటపండని పంటలకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. కొత్తగా సాగు చేసే మామిడికి హెక్టారుకు రూ.15 వేలు, హైబ్రిడ్‌ కూరగాయలకు రూ.20 వేలు, పూల సాగుకు రూ.16 వేలు, చీని, నిమ్మకు రూ.15 వేలు, జామపంటకు ర. 17 వేలు సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద నమోదయ్యే పంటలకు ఉపాది హామీ పథకం ద్వారా సబ్సిడీ అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఏవో జయప్రకాష్‌రెడ్డి, వీహెచ్‌ఏ ప్రశాంత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:17:59+05:30 IST