రాయలసీమ గర్జన విఫలం

ABN , First Publish Date - 2022-12-07T01:15:42+05:30 IST

రాయలసీమ గర్జన విఫలమైందని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కా రెడ్డి అన్నారు.

రాయలసీమ గర్జన విఫలం

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి

మంత్రాలయం, డిసెంబరు 6: రాయలసీమ గర్జన విఫలమైందని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కా రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పంకజ్‌ అతిథి గృహంలో టీడీపీ మం డల కన్వీనర్‌ పన్నగ వెంకటేష్‌ స్వామి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ విభేదాల మధ్య చిచ్చు పెట్టే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. రాయలసీమను అభివృద్ధి చేయాల్సింది పోయి.. రాయలసీమ గర్జన పెట్టడమేంటని ప్రశ్నించారు. విద్యార్థులు, పొదు పు మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లను భయపెట్టి సభకు తీసుకొచ్చారని అన్నారు. సర్పంచులకు ఇచ్చిన నిధులు అడ్డంగా వాడుకోవ డంతో గ్రామాల్లో అభివృద్ధి కరువైందని తెలిపారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు సత్యనారా యణరెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాలపల్లి మాజీ సర్పంచ్‌ చావిడి వెంకటేష్‌, బీసీ సెల్‌ అధ్యక్షులు అమర్నాథ్‌ రెడ్డి, క్రిష్ణమోహన్‌ రెడ్డి, గువ్వల భీమన్న, విజయరామిరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి యేబు, ఎంపీటీసీ నక్కి వెంకటేష్‌, నరసింహులు, మేకల నరసింహులు, సుంకప్ప పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:15:46+05:30 IST