క్వింటం వేరుశనగ రూ.7,396

ABN , First Publish Date - 2022-10-11T06:03:25+05:30 IST

కర్నూలు మార్కెట్‌ యార్డులో వేరుశనగకు మంచి ధర లభిస్తోంది.

క్వింటం వేరుశనగ రూ.7,396

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 10: కర్నూలు మార్కెట్‌ యార్డులో వేరుశనగకు మంచి ధర లభిస్తోంది. శనివారం క్వింటం వేరుశనగ కాయల గరిష్ట ధర రూ.6,600 ఉండగా.. సోమవారం రూ.7,396కు ఎగబాకింది. దీం తో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యస్థం ధర క్వింటానికి రూ.5,899కు చేరింది. అదేవిధంగా ఆముదాల ధర క్వింటం రూ.6,419లు గరిష్ఠంగా ధర పలుకగా.. మధ్యస్థం రూ.6,070 ధర పలికింది. మొక్కజొ న్నలు క్వింటం రూ.1,815, మధ్యస్థం ధర రూ.1,815గా నమోదైంది. ఉల్లిగడ లు క్వింటానికి గరిష్ఠంగా రూ.1,711, మధ్యస్థం ధర రూ.980 పలికాయి. ఎండు మిరప క్వింటానికి రూ.12,399 రైతుల  చేతికందాయి. మధ్యస్థం ధర రూ.7,799గా నమోదైందని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ గోవిందు తెలిపారు.


Read more