విద్యుదాఘాతంతో ఆస్తి నష్టం

ABN , First Publish Date - 2022-03-05T05:43:30+05:30 IST

ఆత్మకూరు పట్టణంలోని కేజీ రోడ్డు సమీపంలోని మోమిన్‌ నగర్‌లో ఖలీల్‌, సలాంకు చెందిన ఓ కార్పెంటర్‌ వర్క్‌ షాప్‌లో శుక్రవారం తెల్లవారు జామున షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది

విద్యుదాఘాతంతో ఆస్తి నష్టం

ఆత్మకూరురూరల్‌, మార్చి 4: ఆత్మకూరు పట్టణంలోని కేజీ రోడ్డు సమీపంలోని మోమిన్‌ నగర్‌లో ఖలీల్‌, సలాంకు చెందిన ఓ కార్పెంటర్‌ వర్క్‌ షాప్‌లో శుక్రవారం తెల్లవారు జామున షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలస్యంగా గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్ని ప్రమాద సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో 2 సోఫాసెట్లు, 2 దివాన్‌ మంచాలు, చౌకట్లు, కర్ర సామగ్రి, మిషనరీ వస్తువులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల ఆస్తి నష్ట సంభవించిందని బాధితులు ఖలీల్‌, సలాం తెలిపారు. సంఘటనా స్థలాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు రషీద్‌ పరిశీలించారు. 



Updated Date - 2022-03-05T05:43:30+05:30 IST