డిగ్రీ కళాశాల ఏర్పాటులో మీనమేషాలు: ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2022-03-05T05:35:31+05:30 IST

ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్నకుమార్‌, అశోక్‌ అన్నారు.

డిగ్రీ కళాశాల ఏర్పాటులో మీనమేషాలు: ఎస్‌ఎఫ్‌ఐ

ఆదోని(అగ్రికల్చర్‌), మార్చి 4: ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్నకుమార్‌, అశోక్‌ అన్నారు. శుక్రవారం ప్రభు త్వ విద్యా రంగ పరిరక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన యాత్ర ఆదోని పట్టణానికి చేరుకుంది. ఆదోని ఆర్ట్స్‌ కళాశాల వద్ద స్థానిక నాయకులు స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ విద్యార్థి సంఘాల నాయకులు 30 ఏళ్లుగా ఆదోనిలో ప్రభుత్వ విద్యా సంస్థల కోసం పోరాడుతున్నారని అన్నారు. ఉత్తుత్తి ఉత్తర్వులతో పాలకులు మభ్యపెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యూనివర్సిటీలలో ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని కోరారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర వ్యాప్తంగా పరిరక్షణ యాత్ర కొనసాగుతుందన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా, సభ్యులు బుజ్జమ్మ, నాయక్‌, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T05:35:31+05:30 IST