జగన్‌కు కాలమే సమాధానం చెబుతుంది

ABN , First Publish Date - 2022-08-04T05:50:49+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌కు కాలమే సమాధానం చెబుతుందని కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు.

జగన్‌కు కాలమే సమాధానం చెబుతుంది
బాదుడే.. బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న ఆకెపోగు ప్రభాకర్‌

కోడుమూరు టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌

సీ.బెళగల్‌, ఆగస్టు 3: ముఖ్యమంత్రి జగన్‌కు కాలమే సమాధానం చెబుతుందని కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు. బుధవారం మండలంలోని ఈర్లదిన్నె, శింగవరం గ్రామాలలో బాదుడే.. బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందుగౌడు అధ్యక్షతన చేపట్టారు. ఈ సందర్భంగా ఆకెపోగు ప్రభాకర్‌ మాట్లాడుతూ తుంగభద్ర నదితీర గ్రామాలకు నెల రోజుల నుంచి ఆర్టీసీ బస్సులు తిరగక ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నా అధికారులకు, నాయకులకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. గడప గడప పేరుతో ఫోజులు ఇచ్చి ఫొటోలు దిగడం కాదని తుంగ భద్రనది తీర గ్రామాల్లో పర్యటిస్తే సమస్య తెలుస్తుందని ఎమ్మెల్యేల నుద్దేశించి అన్నారు. టీడీపీ గెలుపు ఖాయమని  చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతా రన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గిడ్డయ్యగౌడు, రామకృష్ణ, గంప వెంకటేశ్‌, దూదువలి, బసన్న తదితరులు పాల్గొన్నారు.

గూడూరు:
పేరుకే నగర పంచాయతీ అని, చినుకు పడిందటే చాలు చిత్తడి చిత్తడిగా మారుతోందని కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు. బుధవారం గూడూరు పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నిలిచిన వర్షం నీటిని పరిశీలించారు. అధికార యంత్రాంగం స్పందించి ప్రభుత్వ కార్యాలయాల ఆవరణను బా గు చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎల్‌ సుధాకర్‌ రెడ్డి, గజేంద్ర గోపాల్‌ నాయుడు, విజయ రాఘవరెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి దండు సుందరరాజు, మైనార్టీ కార్యదర్శి మన్నన్‌ బాషా, నాగప్ప యాదవ్‌, సులేమాన్‌, సుమన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-04T05:50:49+05:30 IST