వసతి గదుల ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిలుపుదల

ABN , First Publish Date - 2022-01-23T05:37:13+05:30 IST

శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిం చనున్నారు.

వసతి గదుల ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిలుపుదల

శ్రీశైలం, జనవరి 22: శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిం చనున్నారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానం వసతి గదుల ముందస్తు రిజర్వేషన్ల సదుపాయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటన ద్వారా తెలిపారు. అయితే దేవస్థానం కుటీర నిర్మా పథకం కింద కాటేజీలు, గదులు నిర్మించిన దాతలకు ముందస్తు రిజర్వేషను చేయించుకునే అవకాశం కల్పించారు. నిర్మాణ దాతలు ఫిబ్రవరి 10వ తేదీలోగా దేవస్థానం కార్యాలయానికి లిఖిత పూర్వకంగా తెలియజేయవలసి ఉంటుందని, తరువాత వచ్చిన లేఖలను పరిగణలోనికి తీసుకోవని అధికారులు తెలిపారు.  Read more