ఒక్క రోజు జీతం సాయం

ABN , First Publish Date - 2022-08-04T06:02:33+05:30 IST

శ్రీశైల దేవస్థానంలోలో నిత్యాన్న ప్రసాద విభాగంలో పొరుగు సేవల విధులను నిర్వహిస్తున్న ఉమామహేశ్వరుడు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.

ఒక్క రోజు జీతం సాయం
డీడీని అందజేస్తున్న ఈవో

శ్రీశైలం, ఆగస్టు 3: శ్రీశైల దేవస్థానంలోలో నిత్యాన్న ప్రసాద విభాగంలో పొరుగు సేవల విధులను నిర్వహిస్తున్న ఉమామహేశ్వరుడు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. దేవస్థానంలో పని చేస్తున్న తోటి ఒప్పంద, పోరుగుసేవల సిబ్బంది వారి నెలవారి జీతం నుంచి ఒక్కరోజు వేతనం మొత్తాన్ని రూ. 1,18,028 డిమాండ్‌ డ్రాప్టును  ఉమామహేశ్వరుడు  ప్రథమ కుమార్తె సి. మధురమీనాక్షికి అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న చేతులమీదుగా అందజేశారు.

Updated Date - 2022-08-04T06:02:33+05:30 IST