పంటకోత ప్రయోగం పరిశీలన

ABN , First Publish Date - 2022-12-16T00:25:20+05:30 IST

కర్నూలు నగర శివారు ప్రాంతంలోని మునగాల పాడు గ్రామం సమీపాన వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా వరిపంట కోత ప్రయోగాన్ని గురువారం కలెక్టరు పి.కోటేశ్వరరావు పరిశీలించారు

పంటకోత ప్రయోగం పరిశీలన

కర్నూలు(రూరల్‌), డిసెంబరు 15: కర్నూలు నగర శివారు ప్రాంతంలోని మునగాల పాడు గ్రామం సమీపాన వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా వరిపంట కోత ప్రయోగాన్ని గురువారం కలెక్టరు పి.కోటేశ్వరరావు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క గ్రామానికి ఒక్క యూనిట్‌ ఇస్తారని, అందులో భాగంగా మునగాలపాడు రెవెన్యూ గ్రామానికి ఇన్సూరెన్స్‌ యూనిట్‌ నెం.53 కేటాయించినట్లు తెలిపారు. రైతుకు సంబంధించిన పొలంలో సర్వేనెంబరు 45లో వరిపంటపై పంటకోత ప్రయోగం నిర్వహించినట్లు వివరించారు. పంట దిగు బడులను చూసిన తర్వాత ఈసారి సాధారణ దిగుబడులను కంటే అధికంగా వచ్చాయన్నారు. ఈసారి వరిపంట దిగుబడులు బాగా వచ్చాయనని రైతు ఈరన్న కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ వెంట సీపీవో అప్పల కొండ, డివిజనల్‌ ఉపగణాంక అధికారి భాస్కర్‌, ఉపగణాంక అధికారి సుధాకర్‌, సహాయ గణాంక అధికారి శివన్న, వ్యవసాయ అధికారి ఉన్నారు.

Updated Date - 2022-12-16T00:25:24+05:30 IST