‘వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం’
ABN , First Publish Date - 2022-12-15T01:09:39+05:30 IST
వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు.
ఆలూరు రూరల్, డిసెంబరు 14: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆస్పరి మండలం చిగిలి టీడీపీ నాయకులు ప్రభాకర్ నాయడు ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు చెందిన వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు గాండ్ల ప్రభాకర్, మల్లేష్, ఉచ్చప్ప, విరుపాక్షి, గోపాల్ ఆచారి, బోయ రవి, నాగేష్, వడ్డే హనుమంతు, హరి తదితరులు టీడీపీలో చేరారు.