విధుల్లో నిర్లక్ష్యం తగదు: జేసీ
ABN , First Publish Date - 2022-08-04T06:04:36+05:30 IST
సచివాలయ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జెసీ నారపురెడ్డి మౌర్య తెలిపారు.
కోవెలకుంట్ల, ఆగస్టు 3: సచివాలయ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జెసీ నారపురెడ్డి మౌర్య తెలిపారు. బుధవారం కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్ల, భీమునిపాడు, కోవెలకుంట్ల 1, సౌదరదిన్నె సచివాలయాలను జేసీ నారపురెడ్డి మౌర్య అకస్మిక తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సత్వరమే సేవలందించేందుకు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించిందని అన్నారు. సిబ్బంది సరైన సమయానికి విధులకు హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు పుష్పకుమారి, ఎంపీడీవో మహబూబ్ దౌలా, ఈవోఆర్‌డీ రాధికారెడ్డి, ఆర్‌ఐ ఇమ్రాన్, వీఆర్‌వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.