హెబ్బటం గ్రామానికి ముంబై పోలీసులు
ABN , First Publish Date - 2022-06-25T05:40:46+05:30 IST
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని హెబ్బటం గ్రామానికి చెందిన కొండారెడ్డి అనే యువకుడిని ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ సీఐడీ ఎస్ఐలు గణేష్, రాహుల్‌లు శుక్రవారం అరెస్టు చేశారు.

సైబర్ క్రైమ్‌కు పాల్పడిన యువకుడి అరెస్ట్
హొళగుంద, జూన్ 24: కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని హెబ్బటం గ్రామానికి చెందిన కొండారెడ్డి అనే యువకుడిని ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ సీఐడీ ఎస్ఐలు గణేష్, రాహుల్‌లు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడు ముంబైలో సైబర్ నేరస్థులతో కలిసి యాప్ ద్వారా ఆధార్ కార్డుతో లోన్లు ఇప్పిస్తామని చెప్పి కొంత మంది నుంచి నగదు కాజేసినట్లు గుర్తించారు. ఈ మేరకు హొళగుంద పోలీసుల సహకారంతో హెబ్బటంలో కొండారెడ్డిని అదుపులో తీసుకుని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆలూరులోని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో హాజరు పరిచి ముంబైకి తీసుకెళ్లారు.