‘తాగునీటి సమస్య రాకుండా చర్యలు’

ABN , First Publish Date - 2022-03-05T05:41:28+05:30 IST

గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ శ్రీనివాసరెడ్డి అన్నారు.

‘తాగునీటి సమస్య రాకుండా చర్యలు’

గోనెగండ్ల, మార్చి 4: గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం గోనెగండ్ల ఎంపీడీవో సమావేశ భవనంలో మండల సర్యసభ్య సమావేశం నిర్వహించగా మండల అధ్యక్షుడు నసూరుద్దీన్‌ ఆధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మండలంలో నాడు-నేడు పనులకు కింద ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు కులుమాల, ఎర్రబాడు, నెరుడుప్పల పెద్దమరివీడు పాఠశాలలు కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం రెండు పాఠశాలల్లో పనులు ప్రారంభించామని అన్నారు. మండలంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. హౌసింగ్‌ ఏఈ లక్ష్మన్న మాట్లాడుతూ జగనన్న గృహ లబ్ధిదారులు ఈ నెల 15వ తేదీ లోపు తమకు కేటాయించిన స్థలంలో గృహ నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. అనంతరం వ్యవసాయశాఖ ఏవో మాట్లాడుతూ మండలంలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం నత్తనడక సాగుతోందని అన్నారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధుల నిర్మాణ పనులు వేగవంత చేసేందుకు కృషి చేయాలన్నారు. వైద్యశాఖ అధికారి మాట్లాడుతూ కొవిడ్‌ రెండు డోసులు వేయించుకున్నావారు 90 రోజుల లోపు బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, మండల ఉపాఽధ్యక్షులు వెంకటరామిరెడ్డి, రమణీకుమారి, మండల కో ఆప్షన్‌ సభ్యులు రవూఫ్‌, పలుశాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T05:41:28+05:30 IST