సంక్షేమ పథకాల్లో భారీ కోతలు
ABN , First Publish Date - 2022-07-05T06:45:07+05:30 IST
సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోతలు విధిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్చార్జి గౌరు చరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్యాయానికి గురవుతున్న పేదలు
మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, జూలై 4: సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోతలు విధిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్చార్జి గౌరు చరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాలో రాష్ట్రప్రజలకు హామీలను గుప్పించిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి పేదలకు సంక్షేమ పథకాలను దూరం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోమవారం 28వ వార్డు లక్ష్మీపురంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో గౌరు చరిత పాల్గొన్నారు. ఆమె కాలనీల్లో పర్యటించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ధరల పెంపుపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగిస్తుందని అన్నారు. పాలన చేతగాక సీఎం జగన్ సంపద సృష్టించలేక పేద ప్రజలపై భారాన్ని వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్, బస్సుల చార్జీల పెంపుతో పాటు రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం, ఎస్సీ, ఎస్టీలను ఉచిత విద్యుత్‌కు దూరం చేయడం, అమ్మఒడి లబ్ధిదారుల కుదింపు, ఒంటరి మహిళలకు పించన్లు వయోపరిమితి పెంపు, ముిస్లింలకు దుల్హన్ పథకాన్ని దూరం చేయడం వంటి విధానాలు అనుసరిస్తున్నా రని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కుడా డైరెక్టర్ చిన్నమారెన్న, మాజీ జడ్పీచైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి, నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కాసాని మహే్‌షగౌడు తదితరులు పాల్గొన్నారు.