మల్లన్న హుండీ రాబడి రూ.5.6 కోట్లు

ABN , First Publish Date - 2022-03-06T05:17:16+05:30 IST

శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను శనివారం లెక్కిం చారు.

మల్లన్న హుండీ రాబడి రూ.5.6 కోట్లు
కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది


శ్రీశైలం, మార్చి 5: శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను శనివారం లెక్కిం చారు. నగదు రూపేణ రూ.5,60,66,953 వచ్చింది. అలాగే 403 గాముల బంగారం, 10.400 కిలోల వెండి లభించాయి. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు 15 రోజులలో సమర్పించారు. హుండీ లెక్కింపు ఆలయప్రాంగణంలోని అక్కమహదేవి మండపములో పటిష్టమైన భద్రత నడుమ కొనసాగింది. 

Read more