మహాగౌరీ నమోస్తుతే

ABN , First Publish Date - 2022-10-03T05:30:00+05:30 IST

శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు మహాగౌరిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.

మహాగౌరీ నమోస్తుతే
నంది వాహన సేవలో స్వామి, అమ్మవారు

శ్రీగిరిపై ఆది దంపతులకు నంది వాహన సేవ
నేడు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ

శ్రీశైలం, అక్టోబరు 3:
శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు మహాగౌరిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానా లు, పారాయణాలు, చండీహోమం, పంచాక్షరీ, భ్రామ రీ, బాలాజపానుష్ఠానాలు, చండీపారాయణం, చతుర్వే ద పారాయణాలు, కుమారిపూజలు నిర్వహిం చారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషే కం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు చేశారు.

మహా గౌరిగా అమ్మవారు

మహాగౌరి శాంతమూర్తిగా తెల్లని వస్త్రాల ను ధరించి, చతుర్భుజాలను కలిగి ఉంటుంది. కుడివైపు పైభుజంలో త్రిశూలాన్ని, కింది భుజంలో అభయా హస్తాన్ని, ఎడమ వైపు పై భుజంలో ఢమరుకాన్ని కలిగి ఉంటుంది. ఈ దేవిని పూజించడం వలన సకల పాపాలు నశించి, కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.

స్వామి, అమ్మవార్లకు నంది వాహన సేవ

వాహనసేవలలో భాగంగా సోమవారం సాయంత్రం నందివాహనంపై స్వామి, అమ్మ వార్ల ఉత్సవమూర్తులను ఆశీనులనుజేసి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. రాజభటుల వేషాలు, జానపద కళాప్రదర్శన, తప్పెట చిందు, కోలాటం, ఢమరుకం, శంఖ నాదాల నడుమ కోలాహలంగా గ్రామోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్‌. లవన్న, ఎమ్మెల్సీ తలసిల రఘురామ్‌, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

 నేడు సిద్ధిదాయినిగా..

దసరా మహోత్సవాల్లో తొమ్మిదో రోజు మంగళవారం భ్రమరాంబికా అమ్మవారు సిద్ధి దాయిని అలంకారంలో దర్శనం ఇస్తారు. స్వామి, అమ్మవార్లకు అశ్వవాహనసేవ చేస్తా రు.

రాష్ట్ర ప్రభుత్వంచే పట్టువస్త్రాల సమర్పణ

దసరా మహోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉపముఖ్యమంత్రి, దేవదా యశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించ నున్నారు. శాసన సభ్యుడు శిల్పాచక్రపాణి రెడ్డి పాల్గొంటారు.

Read more