Kurnool: నంద్యాల, సంజీవనగర్‌లోని ఓ హోటల్‌లో దారుణం
ABN , First Publish Date - 2022-12-07T12:20:43+05:30 IST
నంద్యాల, సంజీవనగర్‌లోని ఓ హోటల్‌లో దారుణం జరిగింది. హోటల్ టూరిస్టు ఉడిపి (Hotel Tourist Udupi)లో సాంబారు ఇడ్లీలో బల్లి (Lizard) కనిపించడం కలకలం రేపింది.
కర్నూలు: నంద్యాల, సంజీవనగర్‌లోని ఓ హోటల్‌లో దారుణం జరిగింది. హోటల్ టూరిస్టు ఉడిపి (Hotel Tourist Udupi)లో సాంబారు ఇడ్లీలో బల్లి (Lizard) కనిపించడం కలకలం రేపింది. తాము తిన్న సాంబారు ఇడ్లీలో బల్లి కనిపించడంతో కస్టమర్లు ఆగ్రహం వ్య
క్తం చేశారు. దీనిపై ప్రశ్నించిన కస్టమర్లకు యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
బల్లి పడితే ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారా? అంటూ కస్టమర్లు హోటల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. హోటల్ ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోటల్‌పై విచారణ జిరిపి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కస్టమర్లు శాంతించారు.