5 నుంచి సాహితీ ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-12-15T23:36:18+05:30 IST

అజో-విభో-కందాళం ఫౌండేషన్‌, నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ సంయుక్త నిర్వహణలో 30వ వార్షిక తెలుగు రాష్ట్రాల నాటక, సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు జనవరి 5,6,7,8 తేదీల్లో నంద్యాల మున్సిపల్‌ టౌన్‌ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

5 నుంచి సాహితీ ఉత్సవాలు

అజో-విభో-కందాళం ఫౌండేషన్‌ విశిష్ట పురస్కారాలు

నంద్యాల (కల్చరల్‌), డిసెంబరు 15: అజో-విభో-కందాళం ఫౌండేషన్‌, నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ సంయుక్త నిర్వహణలో 30వ వార్షిక తెలుగు రాష్ట్రాల నాటక, సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు జనవరి 5,6,7,8 తేదీల్లో నంద్యాల మున్సిపల్‌ టౌన్‌ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. నిర్వాహక కమిటీ గౌరవ చైర్మన్‌ కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ మధుసూదనరావు, డాక్టర్‌ రవికృష్ణ, కన్వీనర్‌ డీఎస్‌ఎస్‌ మూర్తి, ప్రతినిధి రామకోటేశ్వర రావు గురువారం నంద్యాల మధుమణి నర్సింగ్‌ హోమ్‌ కాన్ఫరెన్సు హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ ఉత్సవాలలో అజో విభో కందాళం ఫౌండేషన్‌ విశిష్ట పురస్కారాలు, పలు కఽథా నాటికల ప్రదర్శనలు, సాహితీ సమాలోచన సదస్సులు పుస్తకాల ఆవిష్కరణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రదర్శించిన ప్రతి నాటికకు రూ.25 వేల నగదు పారితోషికం అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి నంద్యాలకు చెందిన ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రసాద్‌, రవిప్రకాష్‌, శ్రీకాంత్‌, భవనాశి నాగమహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:36:21+05:30 IST