రెడ్‌ క్రాస్‌ మొబైల్‌ వాహనం ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-16T00:24:10+05:30 IST

75 లక్షల విలువ చేసే ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వాహనాన్ని గురువారం నగరం లోని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయం ఆవరణలో కలెక్టర్‌ పి.కోటేశ్వ రరావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డా.జి.గోవిందరెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

 రెడ్‌ క్రాస్‌ మొబైల్‌ వాహనం ప్రారంభం

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 15: 75 లక్షల విలువ చేసే ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వాహనాన్ని గురువారం నగరం లోని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయం ఆవరణలో కలెక్టర్‌ పి.కోటేశ్వ రరావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డా.జి.గోవిందరెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన రాష్ట్రానికి న్యూఢిల్లీ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆర్థిక సహాయంతో నూతనంగా 6 మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వాహనాలు మంజూరయ్యాయని, అందులో కర్నూలు జిల్లాకు ఒకటి కేటాయించారని తెలిపారు. ఈ వాహనంలో రక్తదాత నుంచి రక్తం తీసుకోవడానికి అధునాతన పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు, సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో నాగేశ్వరరావు, డీపీవో నాగరాజునాయుడు, సొసైటీ వైస్‌ చైర్మన్‌ డా.మహేంద్ర కుమార్‌, ఎక్స్‌చైర్మన్‌ జీ.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:24:15+05:30 IST