కర్నూలులో విషాదం
ABN , First Publish Date - 2022-03-05T16:27:52+05:30 IST
కర్నూలు మండలం పూలతోట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
కర్నూలు: కర్నూలు మండలం పూలతోట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా... తల్లి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ అఘాయిత్యానికి కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.