విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు

ABN , First Publish Date - 2022-03-05T14:46:39+05:30 IST

విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది.

విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు

కర్నూలు: విరసం నేత పినాకాపాని ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. తెల్లవారుజాము నుంచి శ్రీ లక్ష్మీ నగర్‌లోని విరసం నేత నివాసంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. కొచ్చిలో ఫిబ్రవరిలో పినాకాపానిపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణకు కర్నూలు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా అధికారులు తెలిపారు. దీనిపై పినాకాపాని మాట్లాడుతూ...‘‘కొచ్చిలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరన్నారు. నేను కొచ్చిలో నేరానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. కుట్రపూరితంగా కేసు నమోదు చేశారు’’ అని పినాకాపాని మండిపడ్డారు. 

Read more