AP News: జనార్ధన్ రెడ్డికి ఎమ్మెల్యే కాటసాని కౌంటర్
ABN , First Publish Date - 2022-08-16T21:43:15+05:30 IST
ఇళ్ల పట్టాలపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కాటసాని కౌంటర్ ఇచ్చారు.

నంద్యాల (Nandyala): బనగానపల్లెలో రాజకీయం (Politics) వేడెక్కింది. ఇళ్ల పట్టాలపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి (Janardhan Reddy) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (Katasani Ramireddy)కౌంటర్ (Counter) ఇచ్చారు. బనగానపల్లె ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేక జనార్దన్ రెడ్డి అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. బనగానపల్లె పట్టణంలో 3 వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే... జనార్ధన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడంతో పట్టాల పంపిణీ ఆగిపోయిందన్నారు. అభివృద్ధి చేస్తుంటే అడుగడుగున ప్రతిపక్ష నాయకుడు అవరోధం కలిగిస్తున్నారని ఆరోపించారు. జనార్దన్ రెడ్డి తన పద్ధతి మార్చుకోకపోతే త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని కాటసాని రామిరెడ్డి అన్నారు.