బాలల చట్టంపై జేసీ సమీక్ష

ABN , First Publish Date - 2022-10-12T05:44:09+05:30 IST

బాలల చట్టం, న్యాయ చట్టం అమలుపై అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

బాలల చట్టంపై జేసీ సమీక్ష

కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 11: బాలల చట్టం, న్యాయ చట్టం అమలుపై అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జరిగిన సమీక్షలో జేసీ బాలల సంక్షేమ సమితికి సంబంధించిన రెండు త్రైమాసిక నివేదికలను రివ్యూ చేశారు. బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌ జుబేదా బేగం ఆరు నెలలకు ముందు వివిధ రకాల బాల బాలికలకు సంబంధించి 237 కేసులు కమిటీ ముందు ఉంచారు. సమీక్షలో సీడబ్ల్యూసీ సభ్యులు, కార్మిక శాఖ, డీసీఎల్‌, దిశా పోలీసులు, చైల్డ్‌ హెల్ప్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Read more