ఎన్టీఆర్‌ పేరు తొలగించడం సరి కాదు

ABN , First Publish Date - 2022-09-23T05:47:23+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం సరి కాదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు పార్లమెంటు జనరల్‌ సెక్రటరీ బొగ్గుల ప్రవీణ్‌ అన్నారు.

ఎన్టీఆర్‌ పేరు తొలగించడం సరి కాదు
కర్నూలులో ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు పార్లమెంటు జనరల్‌ సెక్రటరీ బొగ్గుల ప్రవీణ్‌

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 22:  హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం సరి కాదని  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు పార్లమెంటు జనరల్‌ సెక్రటరీ బొగ్గుల ప్రవీణ్‌ అన్నారు. గురువారం కర్నూలు నగరంలోని పార్టీ కార్యాలయ ప్రాంగణం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయ కులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ మహానేత డా.ఎన్టీఆర్‌ పేరుతో ఉన్న ఆంధ్ర హెల్త్‌ సైన్స్‌ యూనివర్సిటీకీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును పెట్టుకోవడం దారుణ మన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎవరినీ వదలకుండా రాష్ట్ర ప్రజ ల మనస్సులను క్షోభకు గురి చేస్తున్నారని, త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

గూడూరు: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం సరికాదని, తక్షణం చేసిన తప్పును సరిదిద్దుకొని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగానే కొనసా గించాలని కర్నూలు పార్లమెంట్‌ తెలుగు యువత కార్యదర్శి చరణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం గూడూరు పట్టణంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి క్షీరా భిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. తక్షణం హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వై.నాగరాజు, చెట్టుకింది సురేష్‌, నాయుడు, మద్దిలేటి, కిశోర్‌ వర్మ, వడ్డే నాగేష్‌, చెట్టుకింది నారాయణ పాల్గొన్నారు.

Read more