తెల్ల బంగారమే

ABN , First Publish Date - 2022-04-05T05:43:24+05:30 IST

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధర రోజురోజుకూ పెరుగుతోంది.

తెల్ల బంగారమే

 పత్తి ధర  క్వింటం  రూ.12,500


ఆదోని(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 4: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధర రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం యార్డుకు 645 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా క్వింటం గరిష్ఠంగా రూ.12,500, మధ్య ధర రూ.9,869 కనిష్ఠంగా రూ.6,501 పలికింది. ఉక్రెయినపై రష్యా యుద్ధం కారణంగా వంటనూనె ధరలు పెరగడం.. నూనె తయారీకి అవసరమయ్యే దూది గింజలకు డిమాండ్‌ పెరగడంతో పత్తి ధరలు పెరుగుతున్నాయి. మరో వైపు సీజన ముగింపు చేరుకోవడం జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ పరిశ్రమలో బేళ్ల తయారీకి అవసరమైన పత్తి లేకపోవడంతో వ్యాపారులు  పత్తిని కొనుగోలు చేస్తున్నారు. 


Read more