పకడ్బందీగా పెండింగ్‌ కేసులను దర్యాప్తులు చేయాలి

ABN , First Publish Date - 2022-11-24T23:53:13+05:30 IST

పెండింగ్‌ కేసుల దర్యాప్తు పకడ్బందీగా చేయాలని ఎస్పీ సిద్ధ్దార్థ కౌశల్‌ అన్నారు.

పకడ్బందీగా పెండింగ్‌ కేసులను దర్యాప్తులు చేయాలి

ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

కర్నూలు, నవంబరు 24: పెండింగ్‌ కేసుల దర్యాప్తు పకడ్బందీగా చేయాలని ఎస్పీ సిద్ధ్దార్థ కౌశల్‌ అన్నారు. స్థానిక జిల్లా పోలసు శిక్షణా కేంద్రంలో 50 మంది పోలీసులకు గురువారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. 9వ బ్యాచ్‌లో బాగంగా 25 మంది జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ పోలీసు ఆఫీసర్లకు, 25 మంది కంప్యూటర్‌ కానిస్టేబుళ్లకు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో దర్యాప్తులలో, వృత్తిలో (సీసీటీఎన్‌ఎస్‌) సాంకేతి పరిజ్ఞాన మేలకువలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్పీ సిద్ధ్దార్థ కౌశల్‌ హాజరై మాట్లాడుతూ కేసుల దర్యాప్తులలో పోలీసు అధికారులు, సిబ్బంది వృత్తిపరమైన సామర్థ్యం, నైపుణ్యం పెంచుకునేలా చేయడమే ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటాద్రి, వెంకట్రామయ్య, నాగభూషణం, సీఐలు శివశంకర్‌, జాన్సన్‌ ఉన్నారు.

Updated Date - 2022-11-24T23:53:13+05:30 IST

Read more