సిద్ధిదాయినిగా భ్రమరాంబిక

ABN , First Publish Date - 2022-10-05T04:43:10+05:30 IST

శ్రీశైలం క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధిదాయినిగా దర్శనమిచ్చారు.

సిద్ధిదాయినిగా భ్రమరాంబిక

స్వామి, అమ్మవార్లకు అశ్వవాహన సేవ
పట్టువస్త్రాలను సమర్పించిన దేవదాయశాఖ మంత్రి

శ్రీశైలం, అక్టోబరు 4:
శ్రీశైలం క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధిదాయినిగా దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను అశ్వ వాహనంపై ఆశీనులను జేసి విశేష పూజలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టువస్త్రాలను సమర్పించారు. మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. తరువాత మంత్రి స్వామిఅమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Read more