దీక్షా శిబిరంలో వీఆర్‌ఏకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-03-05T05:33:24+05:30 IST

నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద రెండో రోజు శుక్రవారం చేపట్టిన నిరసన దీక్షలో తుగ్గలి మండలానికి చెందిన ఓ గ్రామ సేవకుడు అస్వస్థతకు గురయ్యాడు.

దీక్షా శిబిరంలో వీఆర్‌ఏకు అస్వస్థత
అస్వస్థతకు గురైన గ్రామ సేవకుడు

కర్నూలు(కలెక్టరేట్‌), మార్చి 4: నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద రెండో రోజు శుక్రవారం చేపట్టిన నిరసన దీక్షలో తుగ్గలి మండలానికి చెందిన ఓ గ్రామ సేవకుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. గ్రామ సేవకుల సంఘం అధ్యక్షుడు సత్యరాజ్‌ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని ఆరోపించారు.

Read more