ఐకానిక్‌ బ్రిడ్జితో సీమ కష్టాలు తీరవు: బైరెడ్డి

ABN , First Publish Date - 2022-12-31T00:33:48+05:30 IST

కృష్ణానదిపై నిర్మించబోతున్న ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జితో రాయలసీమ ప్రజల కష్టాలు తీరవని, ప్రకాశం బ్యారేజీ తరహాలో బ్రిడ్జి నిర్మిస్తేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని సీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.

ఐకానిక్‌ బ్రిడ్జితో సీమ కష్టాలు తీరవు: బైరెడ్డి
మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి

ఆత్మకూరు, డిసెంబరు 30: కృష్ణానదిపై నిర్మించబోతున్న ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జితో రాయలసీమ ప్రజల కష్టాలు తీరవని, ప్రకాశం బ్యారేజీ తరహాలో బ్రిడ్జి నిర్మిస్తేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని సీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని చక్రం హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైద్రాబాద్‌ నుంచి తిరుపతికి సుమారు 80కిమీల దూరం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 167కే జాతీయ రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టిందని, అయితే దీని వల్ల సీమప్రజల బ్రతుకుల్లో మార్పు రాదని అన్నా రు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ తరహాలో 854 అడుగుల వాటర్‌లెవల్స్‌తో బ్రిడ్జి నిరిస్తే చీకట్లు కమ్ముకున్న సీమ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతుం దని అన్నారు. ఏప్రిల్‌, మే నెలల వరకు సీమకు సాగు, తాగునీరు పుష్కలంగా అందుతుందని అన్నారు. మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరెడ్డి, నాయకులు సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, రామచంద్రారెడ్డి, ఉమర్‌, లక్ష్మణ్‌సింగ్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:33:49+05:30 IST