హుండీ లెక్కింపు పూర్తి

ABN , First Publish Date - 2022-12-30T00:16:49+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం 34 రోజుల డిసెంబరు నెల హుండీ ఆదాయం రూ.3,30,20,636 నగదు వచ్చిందని, గురువారం లెక్కింపు పూర్తి అయినట్లు మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, వెంకటేష్‌ జోషి తెలిపారు.

హుండీ లెక్కింపు పూర్తి

మంత్రాలయం, డిసెంబరు 29: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం 34 రోజుల డిసెంబరు నెల హుండీ ఆదాయం రూ.3,30,20,636 నగదు వచ్చిందని, గురువారం లెక్కింపు పూర్తి అయినట్లు మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, వెంకటేష్‌ జోషి తెలిపారు. మొదటిరోజు లెక్కింపు పూర్తి కాగా రూ.3,24,07,396 నగదు వచ్చినట్లు తెలిపారు. నవంబరు 24 నుంచి డిసెంబరు 28వ తేదీ వరకు 34 రోజుల హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమరాల నిఘా మధ్య లెక్కించినట్లు తెలిపారు. 2వ రోజు గురువారం లెక్కింపు పూర్తికాగా రూ.3,30,20,636 నగదు వచ్చినట్లు తెలిపారు. 1.300 కేజీల వెండి, 95 గ్రాముల బంగారం, వివిధ దేశాల డాలర్లు వచ్చినట్లు చెప్పారు. శ్రీమఠం చరిత్రలో రికార్డు స్థాయిలో పెద్ద మొత్తం రావడం ఇదే ప్రథమం. హుండీ లెక్కింపులో సూపరింటెండెంట్‌ అనంత పురాణిక్‌, ఆడిటర్‌ దత్తుస్వామి, కృష్ణమూర్తి, గిరిధర్‌, సుజ్ఞానేంద్ర, వాణి, గురురాజ్‌ పాల్గొన్నారు.

రూ.3.25 లక్షల విరాళం

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి బెంగళూరుకు చెందిన ఆర్‌ఎన్‌ సుబ్రమణ్యం అనేభక్తుడు అన్నదానానికి రూ.1.55 లక్షలు చెక్కును, ముంబైకి చెందిన కేఎన్‌ నరసింహరావ్‌ రూ.లక్ష పరిమళ పాఠశాలకు, దోంబ్విలి చెందిన కాంచన మంగళ్‌వేదకర్‌ అనే భక్తులు రూ.70వేలు విరాళంగా ఇచ్చినట్లు మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు,వెంకటేష్‌ జోషి తెలిపారు. విరాలల ఇచ్చిన భక్తులకు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు రాఘవేంద్ర స్వామి మెమెంటో, శేషవస్త్రం, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.

Updated Date - 2022-12-30T00:16:51+05:30 IST