నంద్యాల జిల్లా కోసం హిజ్రాల ధర్నా

ABN , First Publish Date - 2022-02-19T05:34:58+05:30 IST

నంద్యాల జిల్లాలో పాణ్యం మండలాన్ని కలపాలని కోరుతూ శుక్రవారం జాతీయ రహదారిపై హిజ్రాలు ధర్నా చేశారు.

నంద్యాల జిల్లా కోసం హిజ్రాల ధర్నా
జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న హిజ్రాలు

పాణ్యం, ఫిబ్రవరి 18: నంద్యాల జిల్లాలో పాణ్యం మండలాన్ని కలపాలని కోరుతూ శుక్రవారం జాతీయ రహదారిపై హిజ్రాలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పాణ్యం కలపడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఆర్డీవో, రవాణా తదితర కార్యాలయాలకు వెళ్లడానికి 65 కిలోమీటర్లు వెళ్లాల్సిన వస్తుందన్నారు. నంద్యాల జిల్లా సమస్య తీరే వరకు తమ మద్దతు ప్రజాసంఘాల ఉద్యమానికి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రాజునాయుడు, వెంకటాద్రి, దేవదత్తు, రాంమోహన్‌నాయుడు, ప్రతాప్‌, శివకృష్ణ, ప్రజలు పాల్గొన్నారు. Read more