మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి

ABN , First Publish Date - 2022-03-06T05:09:36+05:30 IST

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను శనివారం ఆంధ్రప్రదేశ రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎస్‌. సుబ్బారెడ్డి దర్శించుకున్నారు.

మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి

 శ్రీశైలం, మార్చి 5: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను శనివారం ఆంధ్రప్రదేశ రాష్ట్ర హైకోర్టు జడ్జి ఎస్‌. సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ రాజగోపురం వద్ధ దేవస్థానం అధికారులు అర్చకులు, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.  అనంతరం ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వ చనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.

 శ్రీశైలంలో సాంస్కృతిక కార్యక్రమాలు

 శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపధంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమంలో శనివారం శ్రీమతి సంధ్యకార్తీక్‌, హైదరాబాద్‌ బృందంచే సాంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో తాండవనృత్యకేళి, శివాష్టకం, బ్రహ్మాంజలి, నాట్యహేల, కామాక్షిస్తుతి, ఆనంద తాండవం, నటేశకౌత్వం తదితర గీతాలకు మధుస్మిత, మైథిల్య, సాత్విక, స్ఫూర్తి, భవ్య, నమ్య, సంధ్య, ఉదయ్‌, సాన్విశ్రీ, మహాలక్ష్మి, సురభిదీప్తి, విద్య నృత్య ప్రదర్శనతో అలరించారు. కాగా నిత్య కళారాధనలో భాగంగా ప్రతి రోజు హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తి రంజని వంటి కార్యక్రమాలు దేవస్థానం ఏర్పాటు చేస్తోంది. 


Read more