పర్వతాన్ని ఎక్కేశాడు ..

ABN , First Publish Date - 2022-10-02T05:29:57+05:30 IST

గిరిజనుడిగా పుట్టి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా దాతల సహాయంతో పర్వతాలను అధిరోహిస్తూ సురేష్‌నాయక్‌ భళా అని అనిపించుకుంటున్నాడు.

పర్వతాన్ని ఎక్కేశాడు ..
ఫ్రెండ్షిప్‌ పిక్‌ పర్వతాన్ని అధిరోహించిన సురేష్‌నాయక్‌

భళా సురేష్‌నాయక్‌ 

తుగ్గలి, అక్టోబరు 1: గిరిజనుడిగా పుట్టి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా దాతల సహాయంతో పర్వతాలను అధిరోహిస్తూ సురేష్‌నాయక్‌ భళా అని అనిపించుకుంటున్నాడు. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫ్రెండ్షిప్‌పిక్‌ అనే పర్వతాన్ని 5289 మీటర్ల ఎత్తును సెప్టెంబరు 26 నుంచి పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించి ఈరోజు కిందకు దిగాడు. సురేష్‌నాయక్‌ మండలంలోని రోళ్లపాడు తండాకు చెందిన వెంకటనాయక్‌, లాలి దంపతుల కుమారుడు. దాతల సాయంతో 2020లో ఆఫ్రికా ఖండంలోని ఖిలిమంజారో పర్వతాన్ని, అలాగే ఉత్తరాఖండ్‌లోని రుదుగైరా గంగోత్రి పర్వతాన్ని కూడా అధిరోహించారు. ఇప్పటికే చాలా పర్వతాలను దాతల సహాయంతో అధిరోహించానని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎవరెస్టు పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని చెప్పుకొచ్చాడు. 


  

Read more