AP News: కర్నూలు జిల్లా, ఆదోనిలో వైసీపీ నేతలకు నిరసన సెగ
ABN , First Publish Date - 2022-08-09T16:06:20+05:30 IST
ఆదోనిలో వైసీపీ (YCP) నేతలకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు కార్యక్రమంలో...

కర్నూలు (Kurnool) జిల్లా: ఆదోనిలో వైసీపీ (YCP) నేతలకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని, మాజీ ఎంపీ బుట్టా రేణుకను ప్రజలు అడ్డుకున్నారు. అర్హులైన వారికి అమ్మఒడి నిధులు పడలేదని రేణుకను మహిళలు నిలదీశారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదోనిలో రోడ్లు, డ్రైనేజ్‌లు సరిగా లేవని ఎమ్మెల్యేను పలువురు కాలనీ వాసులు నిలదీశారు. వర్షం వస్తే రోడ్లు కాలవను తలపిస్తున్నాయని ఎరుకల కాలనీ వాసులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడప గడప కార్యక్రమంలో ప్రజలు నిలదీయడంతో వైసీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అన్ని పనులు పూర్తి చేయిస్తానని చెబుతూ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు.