కస్తూర్బాలో నలుగురు
ABN , First Publish Date - 2022-12-18T00:11:03+05:30 IST
ఆలూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శనివారం రాత్రి నలుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థినులకు అస్వస్థత
ఆలూరు, డిసెంబరు 17: ఆలూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శనివారం రాత్రి నలుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తరువాత విద్యార్థినిలు ఉష, అంజలి, సుధ, మానసకు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఎస్‌వో సునీత వారిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దగ్గు తగ్గకపోవడంతో డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఫయాజున్నీసా బేగం ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. విద్యార్థులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారో తెలియలేదని... వైద్య పరీక్షలు చేసి నిర్ధారించవలసి ఉంటుందని వైద్యులు తెలిపారు.