ప్రతి చోటా జెండా ఎగరాలి: డిప్యూటీ కమిషనర్‌

ABN , First Publish Date - 2022-08-04T05:58:50+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలోని గృహ, వాణిజ్య, వ్యాపార సముదాయాలన్నిటిపై ఈనెల 13వ తేదీ నుంచి 15 వరకు జాతీయ జెండాను ఎగురవేయాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ కే.వెంకటేశ్వర్లు అన్నారు.

ప్రతి చోటా జెండా ఎగరాలి: డిప్యూటీ కమిషనర్‌

కర్నూలు(న్యూసిటీ), ఆగస్టు 3:  ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలోని గృహ, వాణిజ్య, వ్యాపార సముదాయాలన్నిటిపై ఈనెల 13వ తేదీ నుంచి 15 వరకు జాతీయ జెండాను ఎగురవేయాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ కే.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కార్మికశాఖ కార్యాలయంలో హర్‌ ఘర్‌ తిరంగా పై వివిధ దుకాణాలు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ మాట్లాడుతూ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలన్నారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్లు సి.సాంబశివ, రమణమ్మ, ఏటీ.శ్రీనివాసులు, సహాయ కార్మిక శాఖ అధికారులు కేసన్న, ఎంఎల్‌. రామ్‌ప్రసాద్‌, శ్రీలక్ష్మి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధి రత్నప్రసాద్‌, క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సాయిబాబా, డీఎస్‌ అబ్దుల్లా పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:58:50+05:30 IST