హోటల్‌కు నిప్పు

ABN , First Publish Date - 2022-01-03T05:39:20+05:30 IST

మండలంలోని మదనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామోహ్మన్‌ బస్టాండ్‌ వద్ద హోటల్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.

హోటల్‌కు నిప్పు

మద్దికెర, జనవరి 2: మండలంలోని మదనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామోహ్మన్‌ బస్టాండ్‌ వద్ద హోటల్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పు పెట్టడంతో హోటల్‌తో పాటు సామాగ్రి అంతా కాలిబూడిదైంది. దాదాపు రూ. 80వేలు నష్టం వాటిల్లింది. జోన్నగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రామాంజనేయుల కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


‘మంచి పద్ధతి కాదు’


రామ్మోహన్‌ హోటల్‌కు పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టడం దారుణమని,  ఇది మంచి పద్ధతి కాదని మాజీ జడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి, టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి ధనుంజయుడు అన్నారు. ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడ్ని పరామర్శించారు. నాయకులు మాట్లాడుతూ పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ హయాంలో ఈ లాంటివి ఎప్పుడు జరగలేదన్నారు. మాజీ సర్పంచ్‌ వెంటకవర్మ, మదనంతపురం టీడీపీ నాయకులు ప్రసాద్‌, సంజప్ప, శ్రీనివాసులు, హరినాథ్‌గౌడ్‌, శ్రీరాములు, సీపీఐ నాయకులు పాపన్న, హనుమన్న, పాల్గొన్నారు.  

Read more