‘కరువు ప్రాంత విద్యార్థుల ఫీజులు రద్దు చేయాలి’
ABN , First Publish Date - 2022-12-15T01:12:42+05:30 IST
కర్నూలు జిల్లాలో కరువు ప్రాం తాలుగా ఎం పికైన మండలాల్లో విద్యార్థులకు అన్ని రకాల పీజులు రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములుగౌడు, జిల్లా ఉపాధ్యక్షులు థామస్ డిమా ండ్ చేశారు.
మంత్రాలయం, డిసెంబరు 14: కర్నూలు జిల్లాలో కరువు ప్రాం తాలుగా ఎం పికైన మండలాల్లో విద్యార్థులకు అన్ని రకాల పీజులు రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములుగౌడు, జిల్లా ఉపాధ్యక్షులు థామస్‌లు డిమా ండ్ చేశారు. మంత్రాలయం జూనియర్ కళాశాల ఆవరణంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పశ్చిమ ప్రాం తంలో అధిక వర్షాలు, వర్షాలు లేక పంటలు చేతికి రాక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. కరువు మండలాల్లో విద్యార్థుల నుంచి వసూలుచేసే ఫీజులన్నీ ప్రభుత్వం రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ మండల అద్యక్ష కార్యదర్శులు జాన్, అనిల్, రాము, ప్రవీణ్, లోకేష్, జయన్న, కిరణ్, పరుశురాములు పాల్గొన్నారు.