విద్యార్థుల జీవితంతో చెలగాటం

ABN , First Publish Date - 2022-06-11T06:46:11+05:30 IST

వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతోందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు.

విద్యార్థుల జీవితంతో చెలగాటం
మాట్లాడుతున్న మాజీ మంత్రి అఖిలప్రియ

ఆళ్లగడ్డ, జూన్‌ 10: వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతోందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని ఆమె స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదో తరగతిలో రెండు పేపర్లకు బదులుగా ఒకే పేపర్‌తో పరీక్షలు నిర్వహించటం వల్ల అధిక సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్‌ అయ్యార న్నారు. ఫెయిల్‌ అయిన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు టీడీపీ అధినేత నారాలోకేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు చొరబడి వెలికిలి నవ్వులు నవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.


‘టీడీపీ శ్రేణులపై కక్ష సాధింపు మానుకోవాలి’


వైసీపీ నుంచి టీడీపీకి మారిన కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు మాను కోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని మాజీ మంత్రి అఖిలప్రియ హెచ్చరించారు. ఇటీవల చాగలమర్రిలో కొలిమి హుసేన్‌వలి ఇళ్లు పడగొట్టించడం అధికార వైసీపీ నాయకులకే సిగ్గుచేటన్నారు. 


Read more