‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి’

ABN , First Publish Date - 2022-12-10T00:28:17+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు వెంటనే ఇవ్వాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కరె కృష్ణ డిమాండ్‌ చేశారు.

‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి’

కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 9: ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు వెంటనే ఇవ్వాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కరె కృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక డీటీఎఫ్‌ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కరెకృష్ణ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ వచ్చినా కూడా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కేవలం జీతాల మీద ఆధారపడే ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. గత రెండేళ్ల నుంచి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగులకు పీఆర్‌సీ, కరువు భత్యం బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ సంపాధిత సెలవుల నగదు, లోన్స్‌ బకాయిలకు రూ.1800 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గోట్ల చంద్ర శేఖర్‌, జిల్లా బాధ్యులు వెంకట్రాముడు, రామన్న, రవీంద్ర, జయన్న, వెంకటా చలం, మల్లికార్జున, రాజేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:28:20+05:30 IST