రాఘవేంద్రుని సన్నిధిలో ప్రముఖులు

ABN , First Publish Date - 2022-08-14T05:48:43+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా ప్రముఖులు రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు.

రాఘవేంద్రుని సన్నిధిలో ప్రముఖులు
రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కృపాసాగర్‌

మంత్రాలయం, ఆగస్టు 13: మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా ప్రముఖులు రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. శనివారం వేర్వేరు సమయాల్లో కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర, అటవీ శాఖ మంత్రి అరవింద్‌ లింబావలి, ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కృపాసాగర్‌, కర్ణాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ శ్రీషానంద్‌, కన్నడ ప్రముఖ సినీ నటుడు, ఎంపీ జగ్గేష్‌, తమిళనాడు మాజీ మంత్రి చిన్నయ్య మంత్రాలయానికి వచ్చారు. వీరికి మఠం అధికారులు, పోలీసు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాదిపతి సుబుధేంద్రతీర్థులు మెమెంటో, వెండి గ్లాసు, శేషవస్త్రం, ఫలపుష్ఫ మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట విధ్వాన్‌ రాజా ఎస్‌.గిరిరాజాచార్‌, మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, బింధు మాధవ్‌, వ్యాసరాజాచార్‌, జేపీ స్వామి, రాయచూరు ఎస్పీ నిఖిల్‌, రాయచూరు డీఎస్పీ వెంకటేష్‌, మంత్రాలయం సీఐ భాస్కర్‌, మంత్రాలయం మాధవరం ఎస్‌ఐలు వేణుగోపాల్‌రాజు, చంద్ర, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాషాచార్‌, వాఘీంద్రచార్‌, పవనాచార్‌, భీమ్‌సేన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:48:43+05:30 IST